TS Elections : ఈసీకి 5వేల ఫిర్యాదులు..

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-15 06:06:52.0  )
TS Elections : ఈసీకి 5వేల ఫిర్యాదులు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సరిగా రెండు వారాల తర్వాత అన్ని పార్టీ ల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇక, తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్లను ఈసీ ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5వేల ఫిర్యాదులు అందాయి. ఇందులో 155 ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. కాగా రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రకటనలపై ఇప్పటికే పరస్పరం ప్రధాన పార్టీలు ఫిర్యాదు చేయగా ఈసీ పలు ప్రకటనలపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story