- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీలో కేసీఆర్ ఇంటి ఎదుట ఓయూ ఓల్డ్ స్టూడెంట్ ధర్నా
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ నివాసం ఎదుట టీఆర్ఎస్ మహిళా నేత ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో శనివారం ఆమె కేసీఆర్ నివాసం ఎదుట ధర్నాకు ఆందోళనకు దిగారు. ఓయూ పూర్వ విద్యార్థి, టీఆర్ఎస్ పార్టీ యూనియన్ లీడర్, ఉద్యమకారిణి అయిన దాత్రికా స్వప్న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసేందుకు అనేక సార్లు ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ లభించకపోవడంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారనే సమాచారం తెలుసుకుని తాను కూడా హస్తినకు వచ్చానని చెప్పారు.
అక్కడ కేసీఆర్ ను కలుద్దామంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారని గత మూడు రోజులుగా తాను పడిగాపులు కాస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో చురుకుగా పని చేసిన తనకు టీఆర్ఎస్ పార్టీలో అవకాశం కల్పిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకోవాలని కోరేందుకే తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. ఉద్యమకారులకు ఏదో ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రగతి భవన్ కు వెళితే అక్కడా లోపలికి రానివ్వడం లేదని కనీసం దేశరాజధానిలో ఉన్న కేసీఆర్ ను కలిసి తన గోడును చెప్పుకుందామంటే సెక్యూరిటీ సిబ్బంది బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.