హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా..బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కు సంకేతమా?

by Prasad Jukanti |
హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా..బీఆర్ఎస్ టు టీఆర్ఎస్ కు సంకేతమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ పేరును మార్చాలనే అంశం తెరపైకి వస్తున్న వేళ మాజీ మంత్రి హరీశ్ రావు టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా మెడలో వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బుధవారం పటాన్ చెరులో కార్యకర్తలతో సమావేశం అయిన హరీశ్ రావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సమయంలో హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ పేరుతో ఉన్న కండువా దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాతే పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తున్నదని, ఎన్నికల్లోనూ ఈ ఎఫెక్ట్ కనిపించిందని సొంత పార్టీలోని పలువురు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో తిరిగి టీఆర్ఎస్ కు మార్చాలనే ప్రతిపాదనలను తెరమీదకు తీసుకువస్తున్నారు. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ సైతం సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనే ఆలోచనతో గులాబీ బాస్ ఉన్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో అనూహ్యంగా హరీశ్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా దర్శనం ఇవ్వడం బీఆర్ఎస్ లో ఆసక్తిగా మారింది. అయితే హరీశ్ రావు యాదృచ్చికంగానే టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారా లేక దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed