- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదం జరిగి నాలుగేళ్లైనా.. బాధితులకు పైసల్ రాలే.. టీఆర్ఎస్ కార్యకర్త ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం, సీఎం కేసీఆర్ చేస్తోన్న అభివృద్ధిని తెలయజేస్తూ.. వ్యతిరేకతను తీసి వేసేందుకు నిరంతరం పనిచేసే సోషల్ మీడియా కార్యకర్త ప్రభుత్వం ఇచ్చిన హామీ కోసం ఎదురుచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. గత నాలుగేళ్ల క్రితం.. కరీంనగర్ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో వరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్తుండగా.. లారీ ఢీ కొనడంతో 7 గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. దీనిపై ప్రభుతం స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, ఇదంతా బాగానే ఉన్నా.. యాక్సిడెంట్ జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా.. మృతుల కుటుంబీకులు ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం. అయితే, మృతుల్లో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే ఐలోని అభిషేక్ సోదరుడు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ కార్యకర్త కుటుంబం ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా ఎదురుచూస్తుండటం చర్చనీయాంశంగా మారింది. చేసేదేమీ లేక టీఆర్ఎస్ కార్యకర్త ట్విట్టర్ వేదికగా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మొర పెట్టుకుంటున్నారు. తన కుంటుంబ సభ్యుల ఆవేదనను గుర్తించి వెంటనే పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో యాక్సిడెంట్స్‌లో చనిపోయిన వారికి ప్రకటించిన పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ ట్వీట్స్, కామెంట్స్ చేస్తున్నారు.
తెరాస కోసం అనునిత్యం సోషల్ మీడియా గా పనిచేస్తున్న ఐలోని అభిషేక్ గారి సోదరుడు ఐలోని నాగరాజు బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా అందనీ 5లక్షల నష్టపరిహారం త్వరగా ఇప్పించగలరని కుటుంబ సభ్యుల ఆవేదన@TelanganaCMO@HamaraWarangal@KTRTRS pic.twitter.com/jI46X4v8N1
— social media abhishek (@iloni_abhishek) March 9, 2022