- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'ఏయ్ బాబు లే'.. కేసీఆర్‌పై 'DJ TILLU' సెటైర్.. నెట్టింట్లో హల్‌చల్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో యాసంగి పంట కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీ వేదికగా కేంద్రంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. '' తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ధాన్యం కొనుగోలు చేయండి. కొనుగోళ్లపై 24 గంటలు టైం ఇస్తున్నాం.. అప్పటి వరకు ఎదురుచూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి'' అంటూ హెచ్చరించారు.
సీఎం హెచ్చరికలతో టీఆర్ఎస్ శ్రేణులు ట్విట్టర్ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తూ సమాధానం చెప్పాల్సిందిగా ట్వీట్లు చేశారు. అయితే, ప్రస్తుతం సీఎం కేసీఆర్ చెప్పిన 24 గంటలు పూర్తవడంతో సర్వత్రా చర్చ మొదలైంది. కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్న ఆలోచనలో పడ్డారు. అయితే, దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. 24 గంటలు పూర్తయ్యిందని చెప్పుకుంటూ.. డీజే టిల్లులోని 'ఏయ్ బాబు లే' అనే వీడియోని పోస్ట్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు గుర్తు చేస్తున్నారు. దీనితో పాటు బీజేపీ నేతలు చేసిన మరికొన్ని పోస్టులు వైరల్ గా మారాయి.
https://t.co/uRKYhG26cK pic.twitter.com/PIrF4uG0Bb
— Butta Ashwin Jandra 🇮🇳 (@AshwinButta) April 12, 2022