- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త జూనియర్ అసిస్టెంట్ల ఇంక్రిమెంట్లపై ట్రెసా ఆవేదన
దిశ, తెలంగాణ బ్యూరో: వీఆర్ఏల నుంచి స్కేల్ పోస్టుకు మారిన జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సభార్డినేట్లకు కొన్ని జిల్లాల్లో సంవత్సరం పూర్తయినా కలెక్టర్లు ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదని ట్రెసా ఆవేదన వ్యక్తం చేసింది. క్లారిఫికేషన్ పేరుతో సీసీఎల్ఏకు లెటర్స్ రాస్తున్నారని, దీని వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లా కలెక్టర్లకు తగు ఆదేశాలివ్వమని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ని శనివారం ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్ కుమార్ లు కోరారు. అలాగే ఎన్నికల ముందు ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహశీల్దార్లను ఎస్ఎస్ఆర్ పూర్తయిన వెంటనే బదిలీ చేసేందుకు మంత్రి హామీ ప్రకారం ప్రక్రియ చేపట్టాలన్నారు. అదే విధంగా ఎస్ఎస్ఆర్ పరిధిలోకి రాని నాయబ్ తహశీల్దార్లను తిరిగి పాత జిల్లాలకు పంపేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ సానుకూలంగా స్పందిస్తూ ట్రెసా కోరిన అంశాలపై తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బృందంలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ లతో పాటు నిజామాబాదు జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, నిర్మల్ కార్యదర్శి అశోక్, సభ్యులు ప్రభు, దాదేమియా పాల్గొన్నారు.