Trending: అట్లుంటది మనతోని.. హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం (వీడియో వైరల్)

by Shiva |   ( Updated:21 May 2024 11:44 AM  )
Trending: అట్లుంటది మనతోని.. హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయత్నం (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: మండు వేసవిలో భానుడి ప్రతాపంతో నగరవాసులు నిత్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంట్లో ఉన్నా సరే.. నిత్యం ఫ్యాన్, ఏసీ లేనిదే బతికేలా కనిపించడం లేదు. ఇక బయటకు వెళితే.. అంతే సంగతులు. ఈ క్రమంలోనే హైదరాబాదీ ఆటోవాలా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లుగా అందరిలా ఆలోచిస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో.. ఏకంగా తన ఆటోకు వెనక వైపు ఏసీ బిగించేశాడు. ఎంచక్కా తన ప్రయాణికులను మండు వేసవిలో కూడా ఏసీ ప్రయాణాన్ని రుచి చూపిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Click here for twitter video

Advertisement

Next Story

Most Viewed