బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది ప్రయాణికులకు సీరియస్

by GSrikanth |   ( Updated:2024-03-09 04:07:45.0  )
బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది ప్రయాణికులకు సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story