తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

by GSrikanth |
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: 14 మంది ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వలు జారీ చేశారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసు శాఖలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ట్రాన్స్​ఫర్లు జరిగాయి. మరికొన్ని రోజుల్లో ఇంకా బదిలీలు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్​కమిషనరేట్‌లో స్పెషల్​బ్రాంచ్​అదనపు కమిషనర్‌గా ఉన్న విశ్వప్రసాద్‌ను ట్రాఫిక్​అదనపు కమిషనర్‌గా నియమించారు. ఇక, పోస్టింగ్​కోసం ఎదురు చూస్తున్న ఏవీ. రంగనాథ్‌కు హైదరాబాద్​జాయింట్​కమిషనర్​(సిట్, క్రైమ్స్)గా పోస్టింగ్​ఇచ్చారు. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా ఉన్న ఎస్.ఎం.విజయ్​కుమార్‌ను హైదరాబాద్​వెస్ట్​జోన్​డీసీపీగా నియమించారు.

వెస్ట్​జోన్​డీసీపీగా ఉన్న జోయల్​డెవిస్‌ను హైదరాబాద్​స్పెషల్​బ్రాంచ్​డీసీపీగా నియమించారు. ఇక, మెదక్​ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శిణికి హైదరాబాద్​నార్త్​జోన్​డీసీపీగా పోస్టింగ్​ఇచ్చారు. నార్త్​జోన్​డీసీపీగా ఉన్న చందనా దీప్తిని అక్కడి నుంచి బదిలీ చేశారు. సిద్దిపేట పోలీస్​కమిషనర్‌గా ఉన్న ఎన్.శ్వేతను అక్కడి నుంచి ట్రాన్స్​ఫర్​చేసి హైదరాబాద్​నేరపరిశోధక విభాగం డీసీపీగా నియమించారు. పోస్టింగ్​కోసం ఎదురు చూస్తున్న ఎల్.సుబ్బరాయుడుకు హైదరాబాద్​ట్రాఫిక్–1 డీసీపీగా పోస్టింగ్​ఇచ్చారు. హైదరాబాద్​టాస్క్​ఫోర్స్​డీసీపీగా ఉన్న నితికా పంత్‌ను అక్కడి నుంచి బదిలీ చేసి డీజీపీ ఆఫీస్‌కు రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. ఇక, హైదరాబాద్​జాయింట్​కమిషనర్‌గా ఉన్న గజరావు భూపాల్‌ను కూడా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు.

నాన్​కేడర్ ఐపీఎస్‌ల బదిలీలు..

ఇక, మరో ఐదుగురు నాన్​క్యాడర్​ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్​ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్​కోసం ఎదురు చూస్తున్న ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్​ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్​ఇచ్చారు. అక్కడ ఉన్న డీ.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. రాచకొండ కమిషనరేట్‌లో రోడ్డు సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీబాల దేవికి హైదరాబాద్​టాస్క్​ఫోర్స్​డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. మాదాపూర్​డీసీపీ సందీప్‌ను అక్కడి నుంచి ట్రాన్స్​ఫర్​చేసి రైల్వే ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. అక్కడ ఉన్న రాఘవేందర్​రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed