Tragedy: మలక్‌పేట్‌లో విషాదం.. వివాహిత అనుమానాస్పద మృతి

by Shiva |
Tragedy: మలక్‌పేట్‌లో విషాదం.. వివాహిత అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వివావాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని మలక్‌పేట్‌ (Malakpet)లో చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం (Srisailam) సమీపంలోని దోమలపెంట (Domalapenta)కు చెందిన సింగం శిరీష (Singam Sirisha) తన భర్త వినయ్‌ కుమార్‌ (Vinay Kumar)తో కలిసి మలక్‌పేట్‌ (Malakpet)లోని జమునా టవర్స్‌ (Jamuna Towers)లో నివాసం ఉంటుంది. అయితే, ఇవాళ ఉదయం ఉన్నట్టుండి శిరీష (Sirisha) గుండెపోటుతో మృతి చెందిదని ఆమె కుటుంబ సభ్యులకు భర్త వినయ్ కుమార్ (Vinay Kumar) సమాచారం అందజేశారు.

ఈ క్రమంలోనే శిరీష తల్లిందండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని స్వగ్రామం దోమలపెంట (Domalapenta)కు భర్త తరలించే యత్నం చేశాడు. కానీ, తమ కూతురిని కొట్టి చంపేశారని, మతదేహంపై గాయాలు కూడా ఉన్నాయని.. గుండెపోటుగా చిత్రీకరించారంటూ మృతురాలి కుటుంబ సభ్యులు మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌ (Malakpet Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్‌మెంట్‌ (Apartment), ఆసుపత్రి (Hospital)లోని సీసీ టీవీ ఫుటేజ్‌ (CC TV Footage)ను పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story

Most Viewed