విషాదం.. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-30 06:39:05.0  )
విషాదం.. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: దంపతుల మధ్య చిన్న గొడవ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. భార్యపై కోపంతో భర్త సూసైడ్ చేసుకుంటే.. తన వల్లే భర్త చనిపోయాడని భార్య ఉరి వేసుకుంది. కూతురి కాపురం ఇలా అయిందని ఆవేదనతో తల్లి నీళ్ల సంపులో దూకి చనిపోయింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షా బాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైతాబాద్ కు చెందిన మల్లేష్, యాదమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మల్లేష్ కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. కుమార్తె సుమిత్రకు రెండున్నరేళ్ల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన కుమ్మరి శివకుమార్ తో వివాహమైంది.

పెళ్లైన నాటి నుంచి వీరికి పిల్లలు పుట్టలేదు. ఆదివారం వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో శివకుమార్ పురుగుల మందు తాగి చనిపోయాడు. తనవల్లే భర్త చనిపోయాడని భార్య సుమిత్ర మంగళవారం రాత్రి హైతాబాద్ లోని పుట్టింట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తన కుమార్తె జీవతం ఇలా అయిందని బాధతో తల్లి యాదమ్మ సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed