నగరవాసులకు 'ట్రాఫిక్' టార్చర్

by Rajesh |   ( Updated:2023-02-08 11:56:54.0  )
నగరవాసులకు ట్రాఫిక్ టార్చర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న అభివృద్ధి ఓ కారణం అయితే, పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. బుధవారం నగరంలోని ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు, ఆఫీసు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే సమయంలో వీపరితమైన ట్రాఫిక్ జాం అవుతుందని.. దానికి తోడు ట్రాఫిక్ పోలీసులు వారాల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో నరకయాతన అనుభవిస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు. కాగా, ఫిబ్రవరి 12 వరకు నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.


Advertisement

Next Story

Most Viewed