- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీమల పాడు మృతులకు కోటి ఇవ్వాలి.. మల్లురవి
దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటనలో మృతి చెందిన బాధితులకు ఒక్కోక్కరికి కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని టీపీసీసీ వైస్‌ప్రెసిడెంట్ మల్లు రవి పేర్కొన్నారు. గాయపడిన వాళ్లకు రూ.25 లక్షలు ఇవ్వడంతో పాటు ఉచిత ట్రీట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అవసరమని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రజల జీవితాలతో ఆటలు వద్దన్నారు.
బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల పేరిట పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నదన్నారు. ఖమ్మం జిల్లా చీమలపాడులో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చడం వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు దీనిపై సమీక్ష జరపాలన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ సమగ్ర రిపోర్ట్ తెప్పించుకోవాలని, ఘటనకు గల అసలు కారణాలేందో తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read..