'ఇంత కంటే అన్యాయం మరోకటి లేదు'.. కేసీఆర్‌పై టీపీసీసీ స్పోక్స్​పర్సన్ ఫైర్

by Vinod kumar |   ( Updated:2023-08-11 16:43:20.0  )
ఇంత కంటే అన్యాయం మరోకటి లేదు.. కేసీఆర్‌పై టీపీసీసీ స్పోక్స్​పర్సన్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం తప్పు చేసి నిరుద్యోగులను బలి చేయడం ఏమిటని..? టీపీసీసీ స్పోక్స్​పర్సన్ చనగాని దయాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ తప్పుడు విధానాల వలన ఆరు లక్షల మంది గ్రూప్ 2 అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 బుక్స్​ఇప్పటి వరకు రాలేదన్నారు. తెలుగు అకాడమీ లో పుస్తకాలు ఎందుకు ప్రింట్ చేయలేదన్నారు.

కొత్త సిలబస్‌కు అనుగుణంగా బుక్‌లు లేకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతోనే వాయిదా వేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు నెలలో నాలుగు పరీక్షలు ఉంటే నిరుద్యోగులకు ఏ పరీక్షలు రాయాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed