తమిళనాడులో హిందీ భాషపై మరోసారి రగడ.. ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ

by srinivas |   ( Updated:2024-10-18 12:29:28.0  )
తమిళనాడులో హిందీ భాషపై మరోసారి రగడ.. ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: హిందీ భాష(Hindi Language)పై తమిళనాడు(Tamil Nadu)లో మరోసారి వివాదం రాజుకుంది. హిందీ మాస వేడుకల(Hindi Masa Celebrations)పై ఆ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందీ మాస వేడుకలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని మోడీ(Prime Minister Modi)కి సీఎం ఎమ్.కే స్టాలిన్(Cm MK Stalin) లేఖ రాశారు. హిందీ మాట్లాడని తమ రాష్ట్రంలో ఉత్సవాలు ఎందుకు అని ప్రశ్నించారు. రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ హోదా కల్పించలేదని గుర్తు చేశారు. చట్టం, న్యాయవ్యవస్థ, కమ్యూనికేషన్‌ కోసమే ఇంగ్లీష్‌(English), హిందీ(Hindi)ని ఉపయోగిస్తున్నారని స్టాలిన్‌ స్పష్టం చేశారు. తమిళ భాష మాస వేడుకలు జరిపించాలని కోరారు. సాంస్కృతిక భాషలకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీని స్టాలిన్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed