'పార్టీలో విభేదాలు లేవు.. ఏఐసీసీ ఆదేశాలతోనే పాదయాత్రలు'

by Vinod kumar |
పార్టీలో విభేదాలు లేవు.. ఏఐసీసీ ఆదేశాలతోనే పాదయాత్రలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని టీపీసీసీ సీనియర్​ఉపాధ్యక్షుడు నిరంజన్​పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాలతోనే ముఖ్య లీడర్లంతా పాదయాత్రలు మొదలు పెట్టారన్నారు. పార్టీ అందరికీ ప్రయారిటీ ఇస్తుందని, ఎవరి మధ్య వ్యక్తిగత విద్వేషాలు లేవన్నారు. సమిష్టి కృషితో పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్​ పార్టీకి ప్రజలంతా అండగా ఉండాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్​పార్టీ తోనే మాత్రమే సాధ్యం అవుతుందన్నారు.

రేవంత్ పాదయాత్రతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్​నగర్ జిల్లాల్లో కాంగ్రెస్​పార్టీ బలోపేతం కాగా, మహేశ్వర్​రెడ్డి, భట్టి పాదయాత్రతో ఆదిలాబాద్​ నుంచి హైదరాబాద్ వయా ఖమ్మం, వరంగల్​ లోనూ పార్టీ బలోపేతం కానున్నదని చెప్పారు. పీపుల్స్​మార్చ్​తో భట్టి విక్రమార్క పాదయాత్ర షురూ అయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​యాత్రలకు భారీగా స్పందన వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు దేశంలోనూ కాంగ్రెస్​ జెండాను ఎగురు వేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed