కాంగ్రెస్‌లో చేరికలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
కాంగ్రెస్‌లో చేరికలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు ఉన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను దిగజారి వాడుతున్నదని విమర్శించారు. మంత్రులు సురేఖ , సీతక్క బలమైన నాయకులు కాబట్టి సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీఅర్ఎస్ అనెతికల్ గా డబ్బులు వెదజల్లి సోషల్ మీడియాతో తప్పులు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తాము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు మంచి పద్ధతిగా సోషల్ మీడియాను వాడుకున్నామని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని చెప్పడానికి లిక్కర్ కేసులో కవిత‌కు బెయిల్ రావడమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీ కి లోపాయకారి ఒప్పందం ఉందన్నారు. ఇరువురు కలిసి మమ్మల్ని ఎదురుకోవడం వారిద్దరి టార్గెట్ అని తెలిపారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టులు ప్రకటిద్దాం అనుకున్నామని, కానీ హర్యానా, జమ్మూ ఎన్నికల వల్ల దసరా లోపు నామినేటెడ్ పదవులు సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలోనే నెల లోపు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. మూసీ సుందరీకరణ కోసం.. డీపీఆర్ రావాల్సింది కూల్చివేతల కోసం కాదన్నారు. మూసీ బాధితుల్లో 50 శాతం ప్రక్షాళనకు ఒప్పుకున్నారని, ప్రభుత్వం దృష్టి అంతా ఇప్పుడు మూసి ప్రక్షాళన పైనే ఉందన్నారు. రెండో అంశం మూసీ సుందరీకరణ అని మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed