- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TPCC President: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ లో కార్యకర్త గుర్తింపుకు నిదర్శనమే నా నియామకమని, కార్యకర్తల కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీకి ఈ అధికారం వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. పీసీసీలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి నాకు అధిక ప్రోత్సాహం అందించారని చెప్పారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువని, నాయకులకు స్వేచ్చ ఉండటంతో బహటంగానే విమర్శలు చేసుకుంటారని అన్నారు. కానీ అవసరం వచ్చినప్పుడు కార్యకర్తల కోసం నాయకులందరూ ఒక్కటై ముందుండి నిలబడతారని, దాని ఫలితంగానే మనకు ఈ అధికారం వచ్చిందన్నారు. గాంధీభవన్ తో నాకు 40 ఏళ్ల అనుభవం ఉందని, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్ కుమార్ సౌమ్యుడని చెప్పారని, ప్రజాస్వామ్యంలో సౌమ్యుడిగా ఉన్నాను కానీ కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనకి మంచి బాష చాలా అవసరమని, మొన్న కౌశిక్ రెడ్డి బాష వల్లే గాంధీ అనుచరులు రెచ్చిపోయారని తెలిపారు. 2014 తర్వాత ముఖ్యంగా కేసీఆర్ సీఎం అయ్యాక బాష చెడిపోయిందని, ప్రజలు కూడా దానికే అలవాటు పడ్డారని తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాషలో ధీటుగా సమాధానం ఇవ్వడం వల్లే ఈనాడు అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు.
సోనియా గాంధీ వల్లే కేసీఆర్‌కు అవకాశం
ఇక రాజకీయాల్లో చాలా వడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు గట్టు ఎక్కినట్లుగా అనిపిస్తుందన్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మన పని మనం చేసుకుంటు పోతే ఏదో ఒక రోజు ఫలితం మన తలుపు తడుతుందని, అలాగే నేను 1983 లో ఎన్ఎస్‌యూఐలో జాయిన్ అయ్యి 40 ఏళ్ల తర్వాత పీసీసీ అధ్యక్షుడిని అయ్యానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని, 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు. కేసీఆర్ కి సోనియా గాంధీ అవకాశం ఇచ్చిందని, ఆమె తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని తెలిపారు. కేసీఆర్ సోనియా ఇచ్చిన తెలంగాణను వారి కుటుంబ అవసరాలకు వాడుకున్నారని, ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణను నీళ్లు, భూములు ఇతర పేర్లపై దోచుకున్నారని, అందుకే ప్రజలు విసిగి వేసారి మనకు అవకాశం ఇచ్చారని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా కార్యక్రమాలు చేశిందని, అయినా సరే బురద జల్లి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడిగా కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసేది ఒక్కటేనని, కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేసీఆర్, కేటీఆర్ సోషల్ మీడియాను వాడుకొని అడ్డమైన రాతలు రాయిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎదుర్కొవాలని చెప్పారు.
వారానికి ఇద్దరు మంత్రులు గాంధీభవన్ కు రావాలి
తాను పీసీసీ అధ్యక్షుడినైనా కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని, పీసీసీ అధ్యక్షుడు కావడంతో జన్మ దన్యమైందని, నిరంతరం కార్యకర్తల సేవలో ఉంటానని, గాంధీభవన్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కొన్ని వినతులు ఉన్నాయని చెప్పి.. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నిర్ణయం గొప్ప విషయమని, అందరూ దానిని ప్రశంసిస్తున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రాను ఆపొద్దని, హైడ్రాను ఒక్క హైదరాబాద్ కే పరిమితం చేయకుండా.. రాష్ట్రమంతా వ్యాపింపజేయాలని కోరారు. కానీ కొందరు బీదవారు తెలియక స్థలాలు కొన్నారని, వారిని రిహబిలిటేట్ చేస్తే హైడ్రా సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అలాగే బోయిన్ పల్లిలో ఉన్న 10 ఎకరాలలో రాజీవ్ గాంధీ ఐడియాలజీ సెంటర్ నెలకొల్పాలని కోరారు. అంతేగాక ప్రతీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్ పార్టీ లాగా కాకుండా మార్కెట్ రేటు ప్రకారం ప్రతీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి స్థల కేటాయింపు చేయాలని కోరారు. అలాగే గాంధీ భవన్ కి ప్రతీవారం ఇద్దరు మంత్రులు చొప్పున రావాలని, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గాంధీభవన్ నిలయం కావాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా వారానికి రెండు సార్లు గాంధీభవన్ లో కనీసం రెండు గంటల సమయం కేటాయించాలని మహేశ్ కుమార్ కోరారు.