- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
TPCC: ఫూలే ప్రయత్నాలు స్పూర్తినిస్తూనే ఉన్నాయి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
దిశ, వెబ్ డెస్క్: సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మహాత్మా ఫూలే(Mahatma Jyotiba Phule) ప్రయత్నాలు స్పూర్తినిస్తూనే ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు(TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) అన్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా అంబర్‌పేట(Amberpeta)లోని ఆయన విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ(Deepadas Munshi), మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V Hanumantharao), డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి(Rohin Reddy), మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Saikumar) సహా ఇతర నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మహేష్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దీనిపై సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మహాత్మా ఫూలే యొక్క దార్శనిక పోరాటం, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని కొనియాడారు. అంతేగాక పూలే ఆశయాలకు పునరంకితమై సమానత్వం, ప్రగతితో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు మనందరం కృషి చేద్దాం అని కాంగ్రెస్ చీఫ్ పిలుపునిచ్చారు.