‘సంబురాలు జరుపుకోండి’.. కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు

by Satheesh |
‘సంబురాలు జరుపుకోండి’.. కాంగ్రెస్ శ్రేణులకు TPCC కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రుణమాఫీ అమలు ప్రాసెస్‌ను కాంగ్రెస్ సర్కార్ మొదలుపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో రుణమాఫీకి మంత్రి మండలి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకకాలంలో రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రైతులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ డెసిషన్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక పిలుపునిచ్చారు. రుణమాఫీ అమలుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని గ్రామాల్లోని రైతులకు వివరించాలని సూచించారు. కాగా, రుణమాఫీ అమలుకు కసరత్తు మొదలెట్టిన సర్కార్.. మాఫీ ప్రక్రియను జూలై నుండి మొదలు పెట్టి పంద్రాగస్ట్ లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.



Next Story