ఓవైసీ పైకి షేర్వానీ వేసుకున్నా.. లోపల మాత్రం ఖాకీ నిక్కరే: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-12 14:30:58.0  )
ఓవైసీ పైకి షేర్వానీ వేసుకున్నా.. లోపల మాత్రం ఖాకీ నిక్కరే: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు తేదీ సమీపిస్తుండటంతో అన్ని పార్టీల ప్రధాన నేతలు ప్రచారాన్ని హోరెత్తి్స్తున్నారు. లీడర్ల మధ్య మాటలు తుటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ విసిరారు. ఓ బీజేపీ ఎంపీకి అసద్ తన ఇంట్లో దావత్ ఇచ్చారా లేదా..? ఖురాన్‌పై ప్రమాణం చేసి చెప్పాలని ఛాలెంజ్ చేశారు. ఈ విషయంపై నేను భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేస్తా.. నీవు సిద్ధమా అని ప్రశ్నించారు. ఓవైసీ పైకి షేర్వానీ వేసుకున్నా.. లోపల వేసుకుంది ఖాకీ నిక్కరేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Next Story