సీపీఐ కార్యాలయానికి రేవంత్ రెడ్డి.. సీట్ల కేటాయింపుపై కీలక ప్రకటన..!

by Satheesh |   ( Updated:2023-11-06 07:38:58.0  )
సీపీఐ కార్యాలయానికి రేవంత్ రెడ్డి.. సీట్ల కేటాయింపుపై కీలక ప్రకటన..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మరికాసేపట్లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సీపీఐ నేతలతో రేవంత్ భేటీ కాబోతున్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు నిర్వహించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం టికెట్‌తో పాటు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్లు తెలుస్తోంది.

మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేసేందుకు సీపీఐ ఆలోచన చేసినా అందుకు కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీనికి సీపీఐ నాయకత్వం సైతం సుముఖత తెలపడంతో సీట్ల సర్దుబాటు అంశం దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ సీపీఐ నేతలతో రేవంత్ రెడ్డి ఫైనల్ డిస్కషన్స్ చేసి పొత్తుపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపారు.

Advertisement

Next Story