- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షోభం వేళ TPCC Chief Revanth Reddy సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: సంక్షోభం వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. 'యాత్ర' పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఎగ్జిక్యూటీవ్ సమావేశంలో పాదయాత్ర లోగో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాదయాత్ర తేదీలను సైతం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి జూన్ 2వ తేదీ వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా అభినందిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ నదీమ్ జావేద్ జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, బలరాం నాయక్, వివిధ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. కాగా, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ సినిమాకు 'యాత్ర' అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే టైటిల్‌లో రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది.