ఎన్నికల వేళ TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

by Satheesh |   ( Updated:2023-05-29 13:31:07.0  )
ఎన్నికల వేళ TPCC చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ప్రకటించారు.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మొత్తం ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పి.రాజేశ్ కుమార్ కన్వీనగర్‌గా, ఎం.రాజమంద్ర రెడ్డి, తన్నీరు నరేందర్, మోహిద్ వాజిత్ హుస్సేన్, జీ.వి.రామకృష్ణలు ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ తక్షణం అమల్లోకి వస్తుందని మహేష్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు.

Read More... కాంగ్రెస్ హయాంలోనే రైతులకు న్యాయం : డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Advertisement

Next Story

Most Viewed