- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిట్‌కు భయపడేదే లేదు: నోటీసులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో తీవ్ర ఆరోపణలు చేస్తోన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సెష్పల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కోరుతూ సిట్ నోటీసుల్లో ఆదేశించింది. కాగా, సిట్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సిట్ నోటీసులకు భయపడేదే లేదని.. ఎట్టి పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న ఆధారాలను సిట్‌కు ఇవ్వమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ల లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని.. అప్పుడే తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ బాగోతం బయటపడాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీక్ వల్ల ఆందోళనకు గురైన 30 లక్షల మంది నిరుద్యోగులకు కాంగ్రెస్ తరుఫున అండగా ఉంటామని రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.
Read more: