- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ప్రగతి భవన్‌పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ భూదందాలకు పాల్పడుతున్నాడంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. డ్రామారావు వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు మియపూర్‌లో 500 కోట్ల విలువైన భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆదిత్య కన్ స్ట్రక్షన్‌కు ధరణితో పేరుతో భూమి బదలాయించారన్నారు. ప్రభుత్వ భూములను కేటీఆర్, ఆయన మిత్ర పక్షం కొల్లగొట్టిందన్నారు. నేను చేస్తున్న ఆరోపణలకు మంత్రి కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలన్నారు. నిషేదిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుండి తొలగించారని.. ఆ భూములు ఎవరి పేరుమీద బదలాయించారో బయటపెట్టాలని డిమాండ్ చేశాడు. నాపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు.