కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్​ఇవ్వండి: రేవంత్ రెడ్డి

by GSrikanth |
కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్​ఇవ్వండి: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కేసీఆర్​దోపిడీని ఇంకా ఎంత కాలం భరిద్దాం’ అంటూ టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన న్యూయార్క్‌లోని జాకబ్ జవిట్స్ స్టేడియంలో జరగనున్న ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ సభ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. తర్వాత అమెరికా న్యూజెర్సీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరై మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వామ్యం కావాలన్నారు. కాంగ్రెస్ విజయంతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని వర్గాలు ఎంతో శ్రమించి పోరాటాలు, త్యాగాలు చేస్తే కేసీఆర్​కుటుంబం ఒక్కటే బాగు పడిందన్నారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తూ అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

తొమ్మిదేళ్ల పాలన కాలంలో కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. ఇప్పటివరకు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజల సగటు జీవితంలో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన అని ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్‌‌కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, కానీ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. అందుకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో హర్యానా రాజ్యసభ సభ్యులు దిపేందర్ హుడా, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story