- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ టైమ్ జీవితంలో అతడి కోసం సారీ చెప్పా: కీలక విషయం బయటపెట్టిన రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర విషయం బయటపెట్టారు. సోమవారం ఓ తెలుగు టీవీ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తన జీవితంలో ఫస్ట్ టైమ్ సారీ చెప్పిన విషయాన్ని వెల్లడించారు. తన జీవితంలో మొదటిసారి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కోసం బహిరంగ క్షమాపణ చెప్పానని అన్నారు. కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఓ సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘మీ తమ్ముడి బీజేపీలోకి పోయిండు.. నువ్వు కూడా పార్టీలో ఉంటే ఉండు లేకపోతే దె...’’ అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశిస్తూ బూతు పదజాలం వాడాడు.
ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కోమటిరెడ్డి అభిమానులు అద్దంకి దయాకర్‌పై మండిపడ్డారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో నష్ట నివారణ చర్యలకు దిగిన రేవంత్ రెడ్డి.. అద్దంకి దయాకర్ తరుఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బహిరంగా క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సైతం అద్దంకి దయాకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో దిగివచ్చిన అద్దంకి దయాకర్ సైతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన అభిమానులకు బహిరంగా క్షమాపణ చెప్పారు.