- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరం ఒక్కటయ్యాం.. ఇక నుంచి BRS కథ ఏంటో చూస్తాం: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కోసం ఏ త్యాగనికైనా సిద్ధమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ మహాసభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మాణిక్ రావు థాక్రే వచ్చారు.. మా మధ్య పంచాయతీలు పోయాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కూడా విభేదాలు అన్ని తొలగిపోయాయని.. అందరం ఒక్కటయ్యామని పేర్కొన్నారు. ఇక నుంచి బీఆర్ఎస్ కథ ఏంటో చూస్తామని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 14 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం సీఎంగా ఎవరికి అవకాశం ఇచ్చినా.. వారిని భుజాలపై మోసుకొచ్చి సీటుపై కూర్చోబెడతానని ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. దొరల కోసం బీఆర్ఎస్, పెట్టుబడిదారుల కోసం బీజేపీ అని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కానీ దళితులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు.