వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ నేతలు.. టీపీసీసీ చీఫ్ ఆదేశాలు

by Javid Pasha |
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ నేతలంతా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మండలానికో మానిటరింగ్​ టీమ్ లను నియమించుకొని సమన్వయంతో పనిచేయాలన్నారు. అంతేగాక క్షేత్రస్థాయిలో కిసాన్​ కాంగ్రెస్ సహాకారంతో పంట నష్టాలు, రైతులు, పేదల కష్టాల వివరాలను సేకరించాలని ఆయన అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చారు. ప్రతి జిల్లా వారీగా వరదలపై రేవంత్ రిపోర్టు కోరారు. ఈసందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని, తద్వారా ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారన్నారు. ఇళ్లలోకి నీరు చేరి, వరదలతో ముంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంటవెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed