మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాల్సిందే: రేవంత్

by GSrikanth |   ( Updated:2022-08-31 07:59:17.0  )
TPCC President Revanth Reddy Alleged CM KCR of Destroying The Education System In The State
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మామా, అల్లుళ్లది హంతక ముఠా అని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావును ఉద్దేశించి టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయిన మహిళా కుటుంబాలను మంత్రి హరీశ్​రావు ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో వినాయక చవితి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో చిట్​చాట్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీశ్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని, నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనలో అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. హెల్త్ మినిస్టర్ బాధిత కుటుంబాలను పరామార్శించి అండగా నిలవాలని సూచించారు. అధికారిని సస్పెండ్​చేయడం కాదని, ఈ వ్యవహారంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా క్రిమినల్​కేసు పెట్టాలని, చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

మునుగోడులో ఇంటింటికీ కాంగ్రెస్​

గురువారం నుంచి మునుగోడులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మండల ఇంఛార్జ్లు ఒక్కొక్కరు మూడు గ్రామాలు తిరగాలన్న ఆయన.. 6 వరకు ఒక విడత ప్రచారం పూర్తవ్వాలని సూచించారు. 3న ప్రెస్ మీట్ ఉంటుందని, అందులో తాను, భట్టి జానారెడ్డి, ఉత్తమ్, వెంకట్ రెడ్డి పాల్గొంటామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరుతామని, రైతు డిక్లరేషన్‌ను వివరిస్తామని తెలిపారు.

హాట్‌ టాపిక్‌గా మారిన కేసీఆర్ బిహార్ టూర్.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Advertisement

Next Story