- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోపణలు చేసిన వారు.. ఆలయానికి రావాలి: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ నుండి రూ.25 కోట్లు డబ్బు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు టీపీసీసీ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బయలుదేరారు.హైదరాబాద్‌లోని ఆయన నివాసం నుండి కార్యకర్తలతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కు భారీ కాన్వాయ్‌తో రేవంత్ రెడ్డి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఇంటి నుండి బయలుదేరే ముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అన్ని విషయాలు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దే మాట్లాడుతానని తెలిపారు.
తనపై ఆరోపణలు చేసిన వారు.. తన సవాల్‌ను స్వీకరించి ప్రమాణం చేసేందుకు అమ్మవారి ఆలయం వద్దకు రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక, రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి బయలు దేరిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఆయన వస్తారా.. రారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.