- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR కామారెడ్డిలో పోటీ చేయడానికి అసలు కారణం అదే: అసలు విషయం బయటపెట్టిన రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను కామారెడ్డి నిర్ణయించబోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనకు కామారెడ్డి చరమగీతం పాడబోతోందని, కామారెడ్డి తీర్పు కోసం యావత్ దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడటానికి కామారెడ్డి సిద్ధంగా ఉందన్నారు.
ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ ఏ రోజు సచివాలయానికి రాలేదని ధ్వజమెత్తారు. కామారెడ్డికి చెందిన రైతు లింబయ్య సచివాలయం ముందే ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు ధాన్యంపైనే గుండె ఆగి చనిపోయాడన్నారు. గజ్వేల్ వాసులను పదేళ్లపాటు మోసం చేసిన కేసీఆర్‌కు ఇవాళ కోనాపూర్ గుర్తు వచ్చిందా అని ప్రశ్నించారు. కామారెడ్డి భూములపై సీఎం కేసీఆర్ కన్ను పడిందని, అందుకే ఆయన ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గజ్వేల్‌ను బంగారు తునక చేసి ఉంటే.. అక్కడి నుండి పారిపోయి కామారెడ్డికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలను కేసీఆర్ నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. గంపగోవర్ధన్ కామారెడ్డి వచ్చి పోటీ చేయాలని కోరాడని కేసీఆర్ చెబుతున్నాడని, ఆయనకు పోటీ చేసేందుకు సిరిసిల్ల, సిద్దిపేట లేదా.. బీసీ నేత అయిన గంప గోవర్ధన్ సీటే కావాలా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు.. కానీ కేసీఆర్‌ను మూడోసారి గెలిపించాలంట అని సీరియస్ అయ్యారు.