- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ వెనక్కి తగ్గు.. లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటా: రేవంత్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ తనకు ఇచ్చిన లీగల్ నోటీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. నోటీసులపై పలు అంశాలపై కౌంటర్ ఇచ్చారు. లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కేంద్రంగా జరిగిందని తెలంగాణ ఉద్యమంతో కేటీఆర్ కు సంబంధం లేదన్నారు. టీఎస్ పీఎస్సీ విషయంలో తాను నిరుద్యోగుల తరపున మాట్లాడానన్నారు.
టీఎస్ పీఎస్సీకి సాంకేంతిక పరిజ్ఞానం ఐటీ శాఖే అందిస్తుందని అలాంటప్పుడు ఈ వ్యవహారానికి కేటీఆర్ కు సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ నియామకం కూడా ఐటీ శాఖ ద్వారానే జరిగిందన్నారు. పేపర్ లీకేజీలపై హైకోర్టులో పిటిషన్ వేశామని, ఈడీకి కూడా ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. కాగా టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని క్షమాపణలు చెప్పని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.