విద్యారంగ సమస్యలపైన ఏఐఎస్ఎఫ్ పోరాటం..

by Sumithra |
విద్యారంగ సమస్యలపైన ఏఐఎస్ఎఫ్ పోరాటం..
X

దిశ, చేర్యాల : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని, ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ అన్నారు. గురువారం ఏఐఎస్ఎఫ్ చేర్యాల మండల సమితి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నరేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంలో సంఘం ముందుందని, భారత దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని తెలియజేశారు.

రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని గాలికి వదిలేయడం వల్ల ప్రభుత్వ గురుకులాలలో విద్యార్థులు తినే ఆహారం కలుషితం కావడం వల్ల ఇటీవల చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురై పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించిన ప్రభుత్వానికి చలనం లేదని, హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఆకుల శిరీష, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎస్కే యాసిన్, ఎద్దు కార్తీక్, ఇప్ప కాయల మౌనిక, పుల్లని అఖిల, కొడకండ్ల అనూష, మహమ్మద్ నుమన్, స్వర్గం ప్రణయ్ సాయి, ఉప్పరపల్లి పూజ, తేలు వైష్ణవి, గిరుకా అభినవ్, ప్రణయ్, కొలుపుల మమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed