- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్.. నువ్వు మొగోడివే అయితే ఆ పని చేయ్: రేవంత్ రెడ్డి మరో సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్‌కు చీము నెత్తురు ఉంటే ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ, ఈడీ విచారణకు సిద్ధమవ్వాలని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. నేను రూ.50 లక్షలు పెట్టి ఎమ్మెల్యేను కొనడానికి వెళ్లానని కేసీఆర్ అన్నారని.. నిజానికి 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వేలాది మంది ఇతర పార్టీల నుంచి గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసింది ఈ సన్నాసి కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో నామినేషన్ అనంతరం బీసీ డిక్లరేషన్ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నేను డబ్బులిచ్చి ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే.. మరి కేసీఆర్ ఎన్ని వందల కోట్లు ఇచ్చి వీరిని కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కొనుగోలు చేసి మంత్రులు చేసింది ఎవరని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని ప్రజాప్రతినిధుల కొనుగోలు కేంద్రంగా మార్చింది కేసీఆరే అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి గతంలో ఏ పార్టీలో గెలిచి బీఆర్ఎస్‌లో చేరారని ప్రశ్నించారు. కేసీఆర్ నువ్వు మొగోడివే అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నాపై, నీపై ఉన్న కేసులపై 24 గంటల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని.. లేకుంటే కామారెడ్డి చౌరాస్తాలో నేలకు ముక్కురాయాలని సవాల్ విసిరారు.