శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా: బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి మరో సవాల్

by Satheesh |
శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా: బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి మరో సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార బీఆర్ఎస్ పార్టీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లో నిర్వహించిన ప్రజా గర్జన సభలో రేవంత్ పొల్గొని మాట్లాడారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నిరూపిస్తే.. శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తానని గులాబీ పార్టీకి సవాల్ విసిరారు. తెలంగాణలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి ఏమి లేదని.. కేవలం తెలంగాణలో కేసీఆర్ సాధించిన అభివృద్ధి రాష్ట్రంలో బెల్టు షాపులు పెంచడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అంతార్జాతీయ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ నిర్మించింది కాంగ్రెస్సేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story