- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ మేం ఓట్లు అడగం.. CM కేసీఆర్‌కు Revanth Reddy సంచలన సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఓట్లు అడగకూడదని.. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ఇళ్లల్లో తాము ఓట్లు అడగమని టీపీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించామని, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబుల్ బెడ్ రూంలు కట్టించదనేది లెక్కలు లేవన్నారు. అధికారులు కూడా సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారన్నారు. కేసీఆర్ తాను విసిరిన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం చేసిందో.. నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? అని ఆయన బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారిందన్నారు. 60 వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు అని విమర్శించారు. వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ.2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారన్నారు.
కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7500 కోట్లకు తెగమ్ముకున్నారు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కడితే.. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడన్నారు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదన్నారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించాలని పిలుపు నిచ్చారు.
ఇక బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఖాయం అవడంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ కరివేపాకులా వాడుకుని వదిలేశారన్నారు. మునుగోడులో కమ్యూనిస్టులతో కలిసిన కేసీఆర్.. అవసరం తీరాక కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. అమిత్ షాతో చీకట్లో ఒప్పందం తర్వాతనే.. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు పంగనామాలు పెట్టాడు అని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా అన్యాయం చేయడం దారుణమన్నారు.
Read More : కర్నాటకలో కాంగ్రెస్ తట్టా, పారా కిందపడేసింది : CM KCR