KTR, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య పెద్దదైంది: Revanth Reddy

by GSrikanth |   ( Updated:2023-01-06 04:31:23.0  )
KTR, కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య పెద్దదైంది: Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నద్దం అవుతుండగా మాస్టర్ ప్లాన్‌లో తమ పొలాలు పోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనిని నిరసిస్తూ ఓ రైతు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా రైతులు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. వీరి బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి రైతు జేఏసీ ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్ శ్రేణులు మద్దతు ఇచ్చి అంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేసి ప్రజా క్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లనే సమస్య జఠిలం అయ్యిందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులతో చర్చించి సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read...

నేడు బండి సంజయ్ రాక.. కామారెడ్డిలో హైటెన్షన్?

Advertisement

Next Story

Most Viewed