- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు ‘అమరుల స్మారకం’ ఆవిష్కరణ
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల ముగింపును పురస్కరించుకొని హుస్సేన్ సాగర్ తీరాన ట్యాంక్ బండ్ పై తెలంగాణ అమరుల స్మారకం – అమర దీపం’ ప్రజ్వలన కార్యక్రమంను బుధవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు కేసీఆర్ స్మారక స్థూపం ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు 'అమరవీరుల సంస్మరణ ర్యాలీ' నీ 6 వేల మంది సాంస్కృతిక శాఖ కు చెందిన కళాకారులతో అంబేద్కర్ విగ్రహం నుంచి అమరుల స్మృతి చిహ్నం వరకు ర్యాలీ కొనసాగనుంది.
10వేల మంది దీపాలతో అమరులకు నివాళులర్పించనున్నారు. 800 డ్రోన్లతో అమరులకు పూలు వేసి ఘన నివాళి అర్పించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లతోపాటు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులంతా పాల్గొనున్నారు. సుమారు 20 వేల మందికి ఏర్పాటు చేసినట్లు సమాచారం. ట్యాంక్ బండ్ సమీపంలో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డున యావత్ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ ప్రతి రోజూ దేదీప్యమానమైన వెలుగనున్నది. తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22న ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అమరుల స్మారకం.. అమర దీపం’ వెలిగించనున్నారు. తద్వారా త్యాగధనులైన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం నిత్య నివాళి అర్పించనున్నది.
Also Read: అమరులు ఎంతమంది? సర్కారు సాయం కొంతమందికే!