Cm Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. నేడు వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ

by Prasad Jukanti |
Cm Revanth Reddy సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. నేడు వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ
X

దిశ, డైనిక్ బ్యూరో: యూపీఎస్సీ సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటాలనే ఉద్దేశంతో సింగరేణి కాలరీస్ సంస్థతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం అర్హులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కుల పంపిణీ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ అభయ హస్తం చెక్కులను అందజేస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన పేద అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం సన్నద్ధం అయ్యేందుకు వారికి ఆర్థికంగా చేయుతగా ఉండాలనే ఉద్దేశంతో రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని గత జులై 20న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించారు.

జనరల్ (ఈడబ్ల్యూఎస్ కోటా)/బీసీ/ఎస్సీ/ఎస్టీ సామాజికవర్గానికి చెందిన తెలంగాణ శాశ్వత నివాసి అయిన వ్యక్తి యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పథకానికి అర్హులు అని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల లోపు మాత్రమే ఉండాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి దరఖాస్తులు తొలుత ఈ నెల 6వ తేదీ వరకు గడువు విధించారు. అయితే గడువు పెంచాలన్న అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నెల 12వ తేదీ వరకు గడువు పెంచింది. దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించిన డెడ్ లైన్ ముగియడంతో ఇవాళ అర్హులైన వారికి సీఎం చేతుల మీదుగా రూ.లక్ష చెక్కులను పంపిణీ చేయనున్నారు.

Advertisement

Next Story