- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Tinmar Mallanna: తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం!.. బీసీ సంఘాలతో భేటీ అనంతరం కీలక ప్రకటన?

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అంశం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో సస్పెండ్‌కు గురైన మల్లన్న రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్‌టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా బీసీ నినాదంపై పని చేస్తున్న తీన్మార్ మల్లన్న ఈ అంశంలోనే ఓ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై (Cast Census) విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో వేటు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారా..? అనేది ఆసక్తిగా మారింది. లేకుంటే ఏదైనా పార్టీలో చేరుతారా అన్నది ఆసక్తిగా మారింది.
బీసీ నినాదం చుట్టే కొత్త పార్టీ?
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ బీసీ నినాదం చుట్టే తిరుగుతుండటంతో తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీకి (New Political Party) శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం తెరపైకి వస్తోంది. అవసరమైతే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతామని ఇప్పటికే ఆర్.కృష్ణయ్య, వట్టే జానయ్య లాంటి బీసీ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో గత నెలలో వరగంల్ సభలోనే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ అటువంటి ప్రకటన ఏమీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతో బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టే దిశగా మల్లన్న పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. బీసీల విషయంలో గొంతు విప్పడం వల్లే వేటు పడిందనే వాదన బీసీ వర్గాల్లో తనకు కలిసి వస్తుందని భావిస్తున్న మల్లన్న.. కొత్త రాజకీయ వేదిక ద్వారా ముందుకు వెళ్లే ఎలా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారట. ఈ మేరకు బీసీ సంఘాల నాయకులతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్‌పై మల్లన్న అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతిమంగా తీన్మార్ మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
నెట్టింట జోరుగా ఊహాగానాలు
తాజా పరిణామాల నేపథ్యంలో మల్లన్న ఏ పార్టీలో చేరుతారన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది. ఆయన బీఆర్ఎస్‌లో (BRS) చేరుతారని కొందరు.. తిరిగి బీజేపీలో (BJP) చేరుతారని మరికొందరు నెట్టింట చర్చించుకుంటున్నారు. టీడీపీలోకి (TTDP) వెళ్లే ఆలోచనతో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. కొంత కాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు కూడా ఖాళీగా ఉంది. బీసీల పార్టీ అనే ముద్ర ఉన్న నేపథ్యంలో టీడీపీలో చేరే అంశాన్ని కొట్టివేయలేమనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోంది. ఇదే సమయంలో బీఎస్పీ (BRSP), జనసేన (JANASENA) వైపు కూడా తీన్మార్ మల్లన్న ఆలోచన ఉండవచ్చనే చర్చ జరుగుతోంది.