- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఎస్సీ, గ్రూప్ 2,3 అభ్యర్థులకు తీన్మార్ మల్లన్న మద్దతు.. సీఎంకు లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి నిరుద్యోగుల డీఎస్సీ, గ్రూప్స్ పోస్టుల అంశంపై నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వరంగల్- ఖమ్మం- నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను నిరుద్యోగులు కలిశారు. ఎమ్మెల్సీతో నిరుద్యోగులు వారి ఆవేదనను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే డీఎస్సీ, గ్రూప్ 2,3 అభ్యర్థులకు మల్లన్న తన మద్దతు తెలిపారు. మరోవైపు డీఎస్సీ అభ్యర్థుల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డీఎస్సీ అభ్యర్థుల వాదన సరైందేనని, వారి డిమాండ్లు న్యాయబద్ధంగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను 3 నెలల పాటు పోస్ట్ పోన్ చేయాలనీ తీన్మార్ మల్లన్న లేఖలో పేర్కొన్నారు.
కాగా, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 1:100 ప్రాతిపదికన ఎంపిక చేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా.. టీజీపీఎస్సీ మాత్రం అభ్యర్థుల్ని 1:50 నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తాజాగా స్పష్టం చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 1:100 నిష్పత్తి అసాధ్యమని బోర్డు తేల్చి చెప్పేసింది.