Teenmar Mallanna : బీసీల కోసం అవసరమైతే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తా: తీన్మార్ మల్లన్న

by Ramesh N |
Teenmar Mallanna : బీసీల కోసం అవసరమైతే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తా: తీన్మార్ మల్లన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాను ఎమ్మెల్సీగా గెలవడానికి కారణం బీసీలు పెట్టిన భిక్షనే అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో కుల జన గణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా తీన్మార్ మలన్న మాట్లాడుతూ.. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికి.. బీసీల కోసం అందరం ఒక్కతాటిపై నిల్చుంటామని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే అవసరం అయితే ఎమ్మెల్సీ పదవిని వదిలేస్తానని హాట్ కామెంట్స్ చేశారు.

తనకు బీసీలే ముఖ్యమని, మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని అన్నారు. బీసీల కులగణనకి జానారెడ్డి లాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారని, బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు పదవులొద్దనే వైఖరితో ఉంటున్నారని ఆరోపించారు. కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఇది రాహుల్ గాంధీ మాట అని వెల్లడించారు. ఇది జరగకుంటే అగ్నిగుండం సృష్టిస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన చారి, సామల వేణు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed