కవితపై అసభ్యకర వ్యాఖ్యలు కేసు: హైకోర్టులో తీన్మార్ మల్లన్నకు ఊరట

by Satheesh |
కవితపై అసభ్యకర వ్యాఖ్యలు కేసు: హైకోర్టులో తీన్మార్ మల్లన్నకు ఊరట
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట లభించింది. కల్వకుంట్ల కవితపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడంటూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రాజేంద్రనగర్ కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ప్రతి శనివారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీన్మార్ మల్లన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని విచారించిన హైకోర్టు రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.

Advertisement

Next Story

Most Viewed