- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒకే టర్ములో మూడు సార్లు.. మంత్రులకు వింత అనుభవం
దిశ, తెలంగాణ బ్యూరో: రెండో దఫా బీఆర్ఎస్ పార్టీ 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి కేబినెట్ 2019లో కొలువుదీరింది. అప్పటికి పాత సెక్రటేరియట్ ఉండడంతో మంత్రులంతా తమ చాంబర్లలో సౌకర్యాలను కల్పించుకున్నారు. తమ అభిరుచికి అనుగుణంగా ఇంటీరియర్ డెకొరేషన్, ఫర్నిచర్ తదితరాలను ఏర్పర్చుకున్నారు. కుటుంబ సమేతంగా పూజలు చేసి లాంఛనంగా చాంబర్లలోకి అడుగుపెట్టారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 జూన్ 27న ఇదే స్థలంలో కొత్త సచివాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేయడంతో కొన్ని నెలలకే పాత భవనాలు తొలగించారు.
దీంతో అప్పటికప్పుడు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోకి కొద్దిమంది మంత్రులు, మింట్ కాంపౌండ్‌లోని దక్షిణ డిస్కం భవన్‌లోకి మరికొద్దిమంది, రిజర్వు బ్యాంకు ఎదురుగా ఉన్న అరణ్య భవన్‌లోకి ఇంకొద్దిమంది.. ఇలా వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. అక్కడ కూడా చాంబర్లను రెడీ చేసుకున్న తర్వాత మంచి ముహూర్తం చూసుకుని పూజలు చేసి లాంఛనంగా అందులోకి ప్రవేశించి కార్యకలాపాలను ప్రారంభించారు. మూడేళ్లు పూర్తిచేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్తిస్థాయి సచివాలయం రెడీ కావడంతో మళ్లీ కొత్త చాంబర్‌లోకి వెళ్తున్నారు. ఇప్పుడు మంచి ముహూర్తాన్ని ఖరారు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పూజలు చేసి చాంబర్‌లోకి ఎంటర్ కానున్నారు. దీంతో రెండో టర్ములోని మంత్రులు ఐదేళ్లలో మూడుసార్లు చాంబర్లు మారినట్లయింది.
Also Read..
మద్నూర్ అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు.. కార్యకర్తల్లో టెన్షన్