కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు స్థానాలు!

by Satheesh |   ( Updated:2023-02-08 00:54:26.0  )
కౌన్ బనేగా ఎమ్మెల్సీ.. వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు స్థానాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ కోటలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. నవీన్ కుమార్, కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ పదవి కాలం వచ్చే నెల లో ముగియనుంది. ఈ మూడు స్థానాలను అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్యా బలం మేరకు తిరిగి బీఆర్ఎస్ గెలుచుకోనుంది. అయితే ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతోంది?అనే చర్చ పార్టీలో ఉంది. ఈ కోటాలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై రెండు రోజులుగా ఫామ్ హౌజ్ లో ఉన్న సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

బీసీలకు ప్రియారిటీ

ఈసారి అసెంబ్లీ కోటాలోని మూడు ఎమ్మెల్సీ పదవుల్లో రెండు స్థానాలు బీసీలకు,ఒక్క స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. బీసీ జాబితాల్లో దాసోజు శ్రావణ్,భిక్షమయ్య గౌడ్, స్వామిగౌడ్ ఉన్నారు. వీరంత మునుగోడు బై ఎలక్షన్ సమయంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినవారే కావడం విశేషం. స్వామిగౌడ్ గతంలో మండలి చైర్మన్ గా పనిచేసి 2018 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు.

గతంలో టీఆర్ఎస్ లో ఉండి, హుజూరాబాద్ బై ఎలక్షన్ తర్వాత భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. పార్టీలో చేరేందుకు ఆలేరు టికెట్ డిమాండ్ చేయగా,ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. ఉద్యమ కాలంలో కేసీఆర్ తో విబేధించి కాంగ్రెస్ లోకి, ఆతర్వాత బీజేపీలోకి వెళ్లిన దాసోజుకు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ ,లేకపోతే రాజ్యసభ టికెట్ ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నవీన్ కుమార్ కు ఎమ్మెల్సీ రెన్యూవల్ అయ్యే చాన్స్ ఉందని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికలకు గవర్నర్ కోటా లింక్

మే నెలలో గవర్నర్ కోటాలోని ఇద్దరు ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు,ఫరూక్ హుస్సెన్ రిటైర్ట్ అవుతున్నారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని వారిద్దురు కోరుతున్నారు. అయితే వీరిలో రాజేశ్వరరావు విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. ఫరూక్ ప్లేస్ లో కొత్తవారిని ఎంపిక చేసే చాన్స్ ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ సీట్లు అడుగుతోన్న ఓ లీడర్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం ఉంది.

ఇవి కూడా చదవండి : ఉత్తర తెలంగాణకే ముప్పు తెచ్చేలా KCR ప్రకటన.. రాష్ట్రంలో సరికొత్త వివాదానికి తెరలేపిన CM..!

Advertisement

Next Story

Most Viewed