విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-31 14:22:38.0  )
విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ నెల వచ్చిందంటే చాలు.. విద్యార్థులకు సెలవులే సెలవులు. ఈ మాసంలో ఎక్కువగా పండుగలు జరుగుతుండటమే హాలిడేస్‌కు కారణం. చిన్నా పెద్ద తేడా లేకుండా జరుపుకునే వినాయక చవితి ఈ నెలలోనే వస్తుంది. దానితోపాటు గ్రామాల్లో బోనాలు, బతుకమ్మ పండుగలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో పాఠశాలలకు ఎక్కువ హాలిడేస్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలో మొత్తం ఎనిమిది రోజులు సెలవులు ఉన్నాయి. ఇక ఈ మాసంలో వరుసగా మూడు రోజులు సెలవులు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ 14న రెండో శనివారం సందర్భంగా ఆ రోజు పాఠశాలలకు సెలవు. మరుసటి రోజు ఆదివారం, అలాగే సోమవారం అంటే సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇలా వరుస మూడు సెలవులు వస్తున్నాయి.

ఇవ్వేకాకుండా ఈ సెప్టెంబర్ నెల ఫస్ట్ తారీకే సెలవుతో ప్రారంభం అవుతుంది. ఈ నెల ఆదివారం నాడు స్టార్ట్ అవుతుండగా.. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 8న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు హాలిడేస్ రానున్నాయి. సెప్టెంబర్ 14న రెండో శనివారం, సెప్టెంబర్ 15న ఆదివారం, సెప్టెంబర్ 16న మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్, సెప్టెంబర్ 22న ఆదివారం, సెప్టెంబర్ 29న ఆదివారంతో ఈ మాసం సెలవులు ముగియనున్నాయి. ఇక ఇవ్వే కాకుండా భారీ వర్షాలు, స్థానిక పండుగల నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక సెలవులు ఇస్తే అవ్వి అదనమనే చెప్పాలి.

Advertisement

Next Story