- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indigo Airlines: ఇండిగోలో సాంకేతిక లోపం..దేశవ్యాప్తంగా విమాన సేవలపై తీవ్ర అంతరాయం
దిశ, వెబ్‌డెస్క్:దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్(Indigo Airlines)లో సాంకేతిక సమస్య(Technical Problem) తలెత్తింది.దీంతో దేశవ్యాప్తంగా ఆ సంస్థ కార్యకలాపాలకు(Activities),విమాన సేవలకు(Flight Services) తీవ్ర అంతరాయం కలిగింది.చెక్-ఇన్ ప్రక్రియలు(Check-in procedures) నెమ్మదిగా సాగడంతో పాటు,టికెట్ బుకింగ్(Ticket Booking)లలో సైతం సమస్యలు ఎదురవుతున్నాయి.దీంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటున్నారు.ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఈ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపంపై ఆ సంస్థ 'ఎక్స్(X)' వేదికగా స్పందించింది.తమ ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్నీనెట్‌వర్క్‌ల్లోనూ తాత్కాలికంగా వ్యవస్థలు నెమ్మదించాయని తెలిపింది. దీని ప్రభావం వెబ్‌సైట్,టికెట్ బుకింగ్ సిస్టమ్‌పై పడిందని పేర్కొంది. చెక్-ఇన్‌లు నెమ్మదిగా సాగుతున్న కారణంగా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలను అందించేందుకు తమ ఎయిర్‌పోర్ట్ బృందం సిద్ధంగా ఉందని వెల్లడించింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.