బుద్ధవనం’ను సందర్శించిన అశోక, అంబేద్కర్ దమ్మయాత్ర బృందం సభ్యులు

by Naveena |
బుద్ధవనం’ను సందర్శించిన అశోక, అంబేద్కర్ దమ్మయాత్ర బృందం సభ్యులు
X

దిశ,నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ అశోక, అంబేద్కర్ దమ్మయాత్ర బృందం సభ్యులు ప్రపంచ శాంతి, బంధుత్వాన్ని కోరుతూ బుద్ధవనం చేరుకుంది. ఈ బృందానికి తెలంగాణ రాష్ట్రం తరపున స్వాగతం పలికారు. ఈ బృందం సభ్యులు ముందుగా బుద్ధ భగవానుని పాద పద్మాల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. అనంతరం బుద్ధ వనంలోని మహా స్తూపం వద్ద బుద్ధ భగవానుని బండాగారాన్ని సందర్శించి ధ్యానం చేశారు. బుద్ధ వనంలోని శ్రీలంక దేశం భిక్షువులు ఏర్పాటు చేసిన..ఆచార్య అవకాన బుద్ధుని నిలువెత్తు విగ్రహాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆయా దేశాలకు చెందిన బుద్ధుని కళాఖండాలను సందర్శించి..బుద్ధవనం విశేషాలను తెలుసుకొని ఆనందించారు. ఈ సందర్భంగా నేషనల్ బుద్దిస్ట్ పేటర్నాటి సొసైటీ కౌన్సిల్ పూజ్య మౌర్య బౌద్ధ బిక్కు భారతీయ ప్రభు మాట్లాడుతూ..ఈ యాత్ర కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నుంచి బయలుదేరి దీక్ష భూమి నాగపూర్ చేరుకుంటుందన్నారు. అక్కడ అశోక విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రపంచ శాంతి, ప్రపంచ బంధుత్వం నినాదంతో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ బృందంలో దమ్మ కమిటీ సభ్యులు దమ్మా ధర్మేంద్రన్, ఉపాసకులు రాజేంద్రన్, కేరళ రాజగోపాలన్, తదితరులు పాల్గొన్నా

Advertisement

Next Story

Most Viewed